కళ్ల ముందుండే అసలు నిజం

భారతదేశంలోని అన్ని ప్రముఖ ఆలయాల ప్రతిరూపాల నిలయం

సురేంద్రపురికి స్వాగతం
భారతీయ ఆత్మను సందర్శించే యాత్ర

భారతీయ పురాణ, ఇతిహాసాల విశేషాలను కళ్ల ముందుంచే సంపూర్ణ ఆధ్యాత్మిక, పౌరాణిక సందర్శనా స్థలం కుందా సత్యనారాయణ కళా ధామం. భారతదేశంలో మొట్టమొదటి ఆధ్యాత్మిక కళా ధామమైన ఈ అద్భుత నిర్మాణం భారతదేశ పౌరాణిక, సాంస్కృతిక, సంప్రదాయాల ఘన వారసత్వాన్ని సందర్శకులకు పరిచయం చేస్తుంది.

సర్వ దేవతల సన్నిధి

సురేంద్రపురి పటం

సురేంద్రపురి విహంగ వీక్షణం

కుందా సత్యనారాయణ కళా ధామాన్ని చుట్టూ వీక్షించండి

నేత్ర పర్వం కలిగించే యాత్రా స్థలం

ప్రాచీన భారతదేశ వైభవాన్ని తెలుసుకోండి. ఇతిహాస కాలాల్లో పునర్జీవించండి

ఫోటో గ్యాలరీ

పౌరాణిక, సాంస్కృతిక అద్భుతాలకు నెలవైన సురేంద్రపురిలోని అపురూప దృశ్యాలు

శ్రీ కుందా సత్యనారాయణ

సురేంద్రపురి వ్యవస్థాపకులు

సురేంద్రపురి, పౌరాణిక ఆశ్చర్యకరమైనది, శ్రీ కుంద సత్యనారాయణ చేత సింగిల్-చేతితో సంభావితంగా రూపొందించబడింది. అతను ఖమ్మం (తెలంగాణ) సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో జన్మించాడు, ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన అతని సాధారణ విలువల ఒక అధికారిక ఉన్నత విద్యను కొనసాగించటానికి అనుమతించలేదు.

సందర్శకుల అనుభూతి

చూడచక్కని ప్రదేశం. అద్భుతమైన అనుభవం
దేవాలయాలు, సంస్కృతి, ఇతిహాసాలను అద్భుతంగా ఆవిష్కరించిన ప్రదేశం ఈ కళా ధామం.
జి.రవి, జాయింట్ కలెక్టర్, యాదాద్రి జిల్లా
భారత దేశపు విస్తృతమైన సంస్కృతి వారసత్వాన్న ఇక్కడ అద్భుతంగా కొలువు దీర్చారు. భారతీయ యువతకు ఈ కళాధామం ఒక యాత్రా స్థలం కావాలి.
మనోజ్ కుమార్, ఐపీఎస్, అదనపు డీజీ(రిటైర్డ్)
శ్రీ కుందా సత్యనారాయణ గారు సమాజానికి చేసిన సేవ ఎంతో అభినందించతగినది.
జస్టిస్ అమర్ నాథ్ గౌడ్, హైకోర్టు, తెలంగాణ
ఈ సుందరమైన కళా ధామం నిర్మాణం ద్వారా శ్రీ.కె.సత్యనారాయణ గారు తమ కుమారుడిని అమర జీవిని చేశారు. ఈ ప్రదేశం ఆత్మతో అనుసంధానమయ్యే ఆధ్యాత్మిక క్షేత్రం. సురేంద్రపురి దర్శనం అద్వితీయమైన అనుభూతి.
రాజీవ్ త్రివేది, ప్రిన్సిపల్ సెక్రటరీ(హోం), తెలంగాణ ప్రభుత్వం
ఇది ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ప్రదేశం. ఇలాంటి ఆధ్యాత్మిక కళా ధామం ప్రపంచంలో వేరెక్కడా ఉండదని నేననుకుంటున్నాను.
ఎస్.జానకి, గాయని
సురేంద్రపురిలో హిందూ పురాణ గాథలన్నింటినీ ఒక్క చోట సందర్శించగలం. ఈ కళాధామం పిల్లలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వికసింపచేస్తుంది.
జి.వి.రమణ రావు, మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ఆర్టీసీ
పురాణ గాథలు, ఇతిహాసాల్లోని అద్భుత ఘట్టాలన్నింటినీ ఒకే చోట వీక్షించడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. ఈ అద్భుత ప్రపంచ సృష్టికర్తకు అభినందనలు.
అనితా రాజేంద్రన్, ఐఏఎస్, అదనపు సెక్రటరీ, హోం శాఖ

ఈ అద్భుతమైన పురాణ పాత్రలు, అందమైన కళా కృతులు శ్రీ కుందా సత్యనారాయణ గారికి ఆధ్యాత్మికత పట్ల ఉన్న మక్కువ గురించి తెలియజేస్తాయి.

రమా రాజేశ్వరి, ఐపీఎస్, అదనపు ఎస్పీ, నల్గొండ
భారత దేశ ఆధ్యాత్మిక, పురాణాల వికాసం గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం సురేంద్రపురి. నాకు, నా కుటుంబానికి ఈ కళా ధామం సందర్శన మరచిపోలేని అనుభూతుల్ని మిగిల్చింది.
వి.ఎస్.కె.కౌముది, ఐపీఎస్, అదనపు డీజీపీ, హైదరాబాద్, తెలంగాణ
సురేంద్రపురిని సందర్శిస్తే భారత దేశాన్ని సందర్శించిన అనుభూతి కలుగుతుంది. పిల్లలకు ప్రాచీన భారత దేశమంటే ఏమిటో తెలియజేయడానికి, వారి జ్ఞానాన్ని వికసింప చేయడానికి ఈ కళా ధామం సరైన స్థలం. తల్లిదండ్రులు, పాఠశాలలు పిల్లలను ఇక్కడికి తీసుకురావాలి
చిరంజీవులు, కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్, నల్గొండ