శ్రీ కుందా సత్యనారాయణ
సురేంద్రపురి వ్యవస్థాపకులు
సురేంద్రపురి, పౌరాణిక ఆధ్యాత్మిక శిల్పఅద్భుతం , శ్రీ కుందా సత్యనారాయణ గారు అనే ఒకేఒక సృజనశీలి మనోశక్తి కి సంకల్పానికి వాస్తవ రూపం. ఆయన మదిలో మెదిలిన మనో భావన, రూపకల్పన, చిత్రకల్పన, నిర్మాణ పర్య వేక్షణ, నిర్మాణం అన్నీ ఏక వ్యక్తి మనో సాధన. శ్రీ కుందా సత్యనారాయణ గారు ఖమ్మం (తెలంగాణ) సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలోజన్మించారు, ఆయన పేదిరకపు కుటుంబ నేపద్యం తనను పాటశాల విద్యకు దూరం చేశాయి. శ్రీ సత్యనారాయణ చిన్న కుమారుడు సురేంద్ర బాబు అకస్మాత్తుగా మరణించారు. ఆయన స్మృతిని సజీవంగా ఉంచడానికి ఒక బృహత్తర నివాళి స్మృతి ని నిర్మిచాలనే తలంపు ఆయనలో జ్వలిస్తూండేది. భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక సాంప్రదాయాల పట్ల ఆయనకున్న ఘాడమైన అనురక్తి , ఆసక్తి, గౌరవం, ప్రేమ ల కారణంగా ఒక ఆధ్యాత్మిక, పౌరాణిక ఆలయ ఉద్యానవనంనిర్మించాలనే భావన ఆయనకు స్పురించింది.
ఆయన బృహత్తర నిర్మాణం ఆరంభించినప్పుడు, ఆయన అనేకమైన కష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పటికే ఆయన వయోభారం, భారీ ప్రాజెక్టు వ్యయాలు, స్నేహితుల , శ్రేయోభిలాషుల సహచరుల నిరుత్సాహ పూరిత హెచ్చరికలు, అవరోధాలు అన్నీ ఆయనలో సంకల్ప శక్తి ని నీరుగార్చలేకపోయాయి. అవి ఆయన ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఉత్తేజపరచటానికి మాత్రమే పనిచేసాయి. డబ్బై ఏళ్ల వయస్సులో, జీవన సాయం సంధ్యా కాలం లో ఆయన తన కలలను సాకారం చేయడానికి రెట్టింపు కష్టపడ్డారు. ఒక దశాబ్దం పైగా ఆయన నిరంతర కృషి లక్ష్య శుద్ధి, నిబద్ధత, సురేంద్రపురి ఒక వాస్తవ రూపం సంతరించుకుంది. నేడు, సురేంద్రపురి ఒక మనోశక్తి భావన, దృష్టి, సంకల్పం దృఢ దీక్ష లకు ఒక దేదీప్యమైన నిర్మాణ నమూనా గా, చిత్తశుద్ధి తో కల సాకారమవుతుందనే, మనసుంటే మార్గముంటుందనే నానుడి కి ఒక నిలువెత్తు నిదర్శనం మనందరి ముందున్న కుందా సత్యనారాయణ కళాధామం. ఒక అనన్య సామాన్యమైన సంపూర్ణ తీర్థ యాత్రా పుణ్యఫలం ఒక్క చోటే అందించే దివ్య ఆలయాల సంగమం కుందా సత్యనారాయణ కళాధామం.