దేశంలోనే మొదటిసారిగా నవ గ్రహాలకు ఇక్కడ వేర్వేరుగా ప్రత్యేక దేవాలయాలను నిర్మించారు. ఆయా దేవుళ్ల దేవేరులు, వాహనాల విగ్రహాలు కూడా ఈ ఆలయాల్లో కొలువై ఉన్నాయి. ప్రతి గ్రహ దేవుడి నిజ రూపాన్ని ఆసనంతో సహా విగ్రహ రూపంలో చెక్కి ఈ దేవాలయాల్లో ప్రతిష్ఠించారు. ప్రతి ఒక్క ఆలయానికి ఆ ఆలయంలో ఉండే గ్రహ దేవుడికి ఇష్టమైన రంగును వేశారు. ప్రతి ఆలయంలో ఆ దేవుడిని అర్చించాల్సిన పూజా విధానాన్ని క్లుప్తంగా పేర్కొన్నారు.
జాతక రీత్యా నవగ్రహ దోషం ఉన్నవారు ఇక్కడ హోమాలు, శాంతి పూజలు చేయించుకునే సౌకర్యం ఉంది. కీడు, అశాంతి నిర్మూలనకు నవగ్రహ హోమం నిర్వహించుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
సందర్శన వేళలు
ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (ప్రతి రోజూ)
ప్రత్యేక పూజలు
ప్రత్యేక నవ గ్రహ ఆలయాల్లో గ్రహ దోష పూజలు, హోమాలు మొదలైనవి
ప్రవేశం: ఉచితం
సంప్రదించండి: 8909 222 888