పంచముఖ హనుమదీశ్వర దేవాలయ ప్రవేశ మార్గం వద్ద త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి అనుచర దేవతల అందమైన శిల్పాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆలయ గోపురాలను ఉత్తర, దక్షిణ నిర్మాణ శైలులను మేళవించి నిర్మించారు. ఆలయ నిర్మాణం మొత్తం వాస్తు శాస్త్రం, ఆగమ శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా జరిగింది.
ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ 16 అడుగుల పంచుముఖ హనుమంతుడి విగ్రహం. కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన నల్ల రాయిని తొలచి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మహా శివలింగం, పంచ ముఖ పరమేశ్వరుడు, నేపాల్ లోని పశుపతినాథ ఆలయాన్ని పోలిన దేవాలయాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. అభిషేకాలు కూడా చేయవచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి.
సందర్శన వేళలు
ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 3 – రాత్రి 8 గంటల వరకు (సోమవారం నుంచి శుక్రవారం వరకు)
ఉదయం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు (శని, ఆది వారాలు మరియు ప్రత్యేక సెలవు రోజుల్లో)
ప్రత్యేక పూజలు
- సుప్రభాత సేవ
- మన్యు సూక్తం శోడశోపచార పూజ
- పంచామృతాభిషేకం
- మన్యు సూక్తం పారాయణం, మొదలైనవి
స్కూళ్లు/కాలేజీలు 9000 788 019 ఫోన్ నెంబరులో సంప్రదించండి
టూర్ ఆపరేటర్లు 8909 222 888 ఫోన్ నెంబరులో సంప్రదించండి